Emergency: ఓటీటీలోకి రానున్న కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' 1 y ago
తన ఆధ్బుతమైన నటనతోనే కాకుండా దర్శకత్వంతో కూడా మంచి పేరు పొందింది కంగనా రనౌత్ స్వీయ. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత ఆధారంగా కంగనా దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఎమర్జెన్సీ' చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కంగనా ఇందిరాగాంధీగా నటించగా, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే ఇతర కీలక పాత్రల్లో నటించారు. ₹60 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా కేవలం ₹21 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించగలిగింది. ప్రస్తుతం ఇది మార్చి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.